: తాను అమ్మిన లాటరీ టికెట్ అతన్ని కోటీశ్వరుణ్ణి చేసింది
సాధారణంగా లాటరీ తగిలితే కోటీశ్వరులవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. అదృష్టం ఉంటే లాటరీ టికెట్లు అమ్మినా కోటీశ్వరుడు కావచ్చని పంజాబ్ కు చెందిన బల్బీర్ అత్వాల్ నిరూపించారు. కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడిన బల్బీర్ కు కాలిఫోర్నియాలోని చినోహిల్స్ ప్రాంతంలో ఓ లాటరీ స్టోర్ ఉంది. అక్కడ అన్ని లాటరీ టికెట్లు లభ్యమవుతాయి. తాజాగా ఆ స్టోర్ అమ్మిన పవర్ బాల్ లాటరీ టికెట్ కు ప్రైజ్ లభించింది. దీంతో ఆ టికెట్ అమ్మినందుకుగాను రిటైల్ బోనస్ కింద బల్బీర్ స్టోర్ కు సదరు లాటరీ సంస్థ మిలియన్ డాలర్ల (6.7 కోట్ల రూపాయల) చెక్ పంపింది. దీనిని స్వీకరించిన బల్బీర్ ఈ మొత్తాన్ని కుటుంబానికి, సిబ్బందికి, ఛారిటీకి వినియోగిస్తానని చెప్పారు.