: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... నలుగురు మావోయిస్టుల హతం
నిషేధిత మావోయిస్టులకు వరుస ఎదురుబెబ్బలు తప్పడం లేదు. ఛత్తీస్ గఢ్, అసోం రాష్ట్రాలతో పాటు ఇటీవలి కాలంలో విశాఖ మన్యంలోనూ దాడులతో బెంబేలెత్తిస్తున్న మావోయిస్టులపై భద్రతా దళాలు మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి ఛత్తీస్ గఢ్ లోని బిజాపూర్ జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.