: సొంతూళ్లో సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు... పంచెకట్టుతో ఆకట్టుకున్న బాలయ్య


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు హాజరయ్యారు. నిన్న రాత్రికే నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. మరికాసేపట్లో ఆయన గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. మరోవైపు చంద్రబాబు కుటుంబం మొత్తం సంక్రాంతి వేడుక కోసం నారావారిపల్లెకు చేరుకుంది. ఇక చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కూడా మొన్ననే నారావారిపల్లె చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చిన చంద్రబాబుతో బాలయ్య కూడా గ్రామ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పంచెకట్టుతో బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి ఉదయం గ్రామంలోని నాగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.

  • Loading...

More Telugu News