: శిఖర్ ధావన్ తీరు మారలేదు... రెండో మ్యాచ్ లోనూ స్వల్ప స్కోరుకే ఔట్


ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తీరు మారలేదు. తొలి మ్యాచ్ లో స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరి నిరాశపరిచిన ఈ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ తాజాగా బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో మ్యాచ్ లోనూ స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. కొద్దిసేపటి క్రిత ప్రారంభమైన మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ధావన్ (6) సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు. కేవలం నాలుగంటే నాలుగు బంతులు ఎదుర్కొన్న అతడు ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో జోయెల్ ప్యారిస్ బౌలింగ్ లో హాజెల్ వుడ్ చేతికి చిక్కాడు. ధావన్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ (11), రోహిత్ శర్మ(22)తో కలిసి స్కోరు బోర్డులో కదలిక తెచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 41 పరుగులకు చేరింది.

  • Loading...

More Telugu News