: సెకండ్ మ్యాచ్ లోనూ టాస్ మనదే... బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా-ఆసీస్ ల మధ్య రెండో వన్డే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లోనూ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే టాస్ నెగ్గాడు. తొలి మ్యాచ్ లో తీసుకున్న నిర్ణయం మాదిరే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్ మాదిరే టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ(3)...మరో స్టార్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ (2) తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ నష్టపోకుండానే భారత్ 5 పరుగులు చేసింది.