: కొనసాగుతున్న కోడి పందాల జోరు... ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.200 కోట్లు దాటిన బెట్టింగ్


కోర్టు ఆదేశాలు బేఖాతరు. పోలీసుల ఆంక్షలు పటాపంచలు... వెరసి సంక్రాంతి సందర్భంగా తెలుగు నాట మొన్నటి నుంచే మొదలైన కోడి పందాల జోరు కొనసాగుతోంది. కోడి పందాల నిర్వహణపై ఎలాంటి అనుమతులు లేకున్నా, వద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. సాక్షాత్తు ప్రజా ప్రతినిధులే పలు చోట్ల కోడి పందాలను లాంఛనంగా ప్రారంభించారు. నిన్నటికే రెండు రోజుల పాటు కొనసాగిన కోడి పందాలు... నేడు, రేపు కూడా కొనసాగనున్నాయి. కోడి పందాలు ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో హోరెత్తుతున్నాయి. నిన్నటివరకే ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.200 కోట్లకు పైగా బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కోడి పందాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న ఈ రెండు జిల్లాల్లోనే ఏకంగా 400 బరులు ఏర్పాటయ్యాయి. ఈ పందాల్లో పాలుపంచుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు ఈ ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

  • Loading...

More Telugu News