: రామ్ దేవ్ జీ... నా కోసం ప్రార్థన చేయండి: సంజూభాయ్


పూణెలోని ఎరవాడ జైలులో ఖైదీగా ఉన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ కలుసుకున్నారు. జైలు అధికారుల అనుమతి మేరకు బాబా రామ్ దేవ్ ఖైదీలకు యోగా నేర్పేందుకు జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఖైదీగా ఉన్న సంజయ్ దత్... రామ్ దేవ్ బాబాతో మాట్లాడుతూ, జైలు నుంచి తాను త్వరగా విడుదల అయ్యేలా తనకోసం ప్రార్థన చేయాలని కోరాడు. కాగా ఖైదీలు తమను తాము ఫిట్ గా ఉంచుకునేందుకు, మానసిక ప్రశాంతత పొందేందుకు రామ్ దేవ్ బాబా వారికి యోగా శిక్షణనిచ్చారు.

  • Loading...

More Telugu News