: ఆమిర్... ముందు నీ భార్యకు చెప్పుకో!: రామ్ మాధవ్
దేశ విశిష్టతపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ నేత రామ్ మాధవ్... ఆమిర్ పై విరుచుకుపడ్డారు. 'ఆమిర్... దేశానికి ఉన్న విశిష్టత గురించి ముందు నీ భార్యకు వివరించు... బయట ఆటోరిక్షా నడిపేవారికి చెబితే సరిపోదు..' అని వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో ఎవరూ కూడా తమ అవార్డులను తిరిగి ఇవ్వాల్సిన పనిలేదని, దేశాన్ని గౌరవిస్తూ, దేశ ప్రతిష్టను గుర్తుంచుకోవాలని సూచించారు.