: విదేశాల్లో భారతీయులందర్నీ హిందువులంటారు... ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్
భారతీయులు విదేశాలు వెళ్లినపుడు వారిని అక్కడ హిందువులుగానే గుర్తిస్తారని ఆర్.ఎస్.ఎస్ సుప్రీం మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. 'మనమంతా హిందువులమే.. దేశంలో భిన్నత్వం ఉన్నప్పటికీ, మనం భారతదేశం దాటి బయటకు వెళ్లినపుడు అక్కడ మనల్ని హిందువులనే పిలుస్తారు' అని ఆయన పేర్కొన్నారు. 'ప్రపంచంలో భారత్ లాంటి మహోన్నత దేశమే లేదు.. ఇక్కడ ఐకమత్యం వెల్లివిరుస్తుంది. ఈశ్వరుణ్ణి ఎరిగినవాడే అసలైన హిందువ'ని మోహన్ భగవత్ పేర్కొన్నారు.