: వెంకన్న భక్తులకు టీటీడీ సంక్రాంతి కానుక!... ‘ప్రత్యేక’ టికెట్లపై మరో అదనపు లడ్డూ!


తిరుమల వెంకన్న భక్తులకు నిజంగా ఇది శుభవార్తే. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసే భక్తులకు ఇకపై మరో అదనపు లడ్డూ లభించనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300 టికెట్లను కొనుగోలు చేస్తున్న భక్తులకు ఇప్పటిదాకా రెండు ఉచిత లడ్డూలతో పాటు రూ.25కు ఓ లడ్డూ కలిపి మొత్తం 3 లడ్డూలు లభించేవి. అయితే ఒక టికెట్ పై ఒకే అదనపు లడ్డూ సరిపోవడం లేదని, ఈ కోటాను మరింత పెంచాలన్న భక్తుల విజ్ఞప్తిని పరిశీలించిన టీటీడీ... ఇకపై రూ.25కు మరో అదనపు లడ్డూను ఇచ్చేందుకు నిర్ణయించింది. అంటే, రూ.300 దర్శన టికెట్లు కొనుగోలు చేసే భక్తులకు ఇకపై రూ.25లకు ఒకటి చొప్పున 2 లడ్డూలు లభించనున్నాయి.

  • Loading...

More Telugu News