: పఠాన్ కోట్ కేసు... ఒకేసారి సల్వీందర్‌సింగ్, మదన్‌గోపాల్, సోమ్‌రాజ్‌ల విచారణ


పఠాన్‌కోట్‌ కేసు దర్యాప్తులో పంజాబ్ ఎస్‌పీ సల్వీందర్‌ సింగ్ ను, ఆయనతో పాటు కిడ్నాపైన వంట మనిషి మదన్ గోపాల్, దర్గా సంరక్షకుడు సోమ్‌రాజ్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ ఒకేసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ పూర్వాపరాలకు సంబంధించి వారు చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవటంతో మరింత స్పష్టత కోసం సల్వీందర్‌సింగ్, మదన్‌గోపాల్, సోమ్‌రాజ్‌లు ముగ్గురినీ ఒకేచోట కూర్చోబెట్టి ప్రశ్నిస్తామని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. తాను పీర్ దర్గాకు తరచుగా వెళ్లేవాడినని ఎస్‌పీ సల్వీందర్‌ చెబుతుండగా, తొలిసారిగా ఆయన ఆ దర్గాకు రావటం చూశానని సోమ్‌రాజ్ చెప్తున్నాడు. దీంతో ఎన్‌ఐఏ వర్గాలు నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ముగ్గురినీ ఒకేసారి ప్రశ్నించాలని నిర్ణయించాయి.

  • Loading...

More Telugu News