: నారావారి పల్లెలో పంచెకట్టుతో చంద్రబాబు... బాలయ్యను చూసేందుకు ఎగబడ్డ యువకులు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నారావారిపల్లె చేరుకున్నారు. సంప్రదాయ పంచెకట్టులో సందడి చేసిన చంద్రబాబు స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, ఆటల పోటీల్లో పాల్గొన్న వారిని ఆయన ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు స్థానిక నాయుకులు పెద్దఎత్తున చేరుకున్నారు. మరోపక్క, బాలకృష్ణను చూసేందుకు యువకులు పోటీ పడ్డారు. దీంతో నారావారిపల్లెలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలకు న్యాయనిర్ణేతలుగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాలయ్య భార్య వసుంధరలు వ్యవహరించడం విశేషం.