: నేను చాలా ఎమోషనల్ పర్సన్ ని...నేను అలాగే ఉంటాను: జూనియర్ ఎన్టీఆర్
తాను చాలా ఎమోషనల్ పర్సన్ ని అని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. 'నాన్నకు ప్రేమతో' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, తనకు అలా ఎమోషనల్ అవడమే ఇష్టమని అన్నాడు. భావోద్వేగాలను మనసులో అదుముకుని, బయటకు నటించడం తనకు ఇష్టం ఉండదని చెప్పాడు. నటనను తెరమీద పలికిస్తానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, అమ్మ, నాన్న, అభిమానుల విషయంలో తాను చాలా ఎమోషనల్ పర్సన్ ని అని చెప్పాడు. అభిమానులు చూపించే ఆత్మీయాభిమానాలకు రుణం తీర్చుకోలేమని, తన కట్టె కాలేవరకు వారు అలాగే అభిమానం చూపిస్తారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. ఈ సినిమాలో పాత్రలకు ప్రత్యమ్నాయ వ్యక్తులు లేరని, పాత్రలకు తగ్గ నటులను ఎంచుకున్నామని, ఎంతో శ్రద్ధతో సినిమాను రూపొందించామని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.