: విమర్శలు బాధిస్తాయి...కానీ వాస్తవముంది కదా?: రోహిత్ శర్మ


సాధారణంగా ఎవరైనా విమర్శించినప్పుడు బాధ కలుగుతుందని టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ చెప్పాడు. తొలి వన్డేలో సెంచరీ చేసినా పరాజయం పాలైన సందర్భంగా సోషల్ మీడియాలో రోహిత్ పై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ సెంచరీ చేస్తే టీమిండియా ఓటమి ఖాయమని నెటిజన్లు పేర్కొన్నాడు. దీనిపై రోహిత్ మాట్లాడుతూ, ఎంత భారీ స్కోరు చేసినప్పటికీ జట్టు ఓటమిపాలైతే బాధేస్తుందని తెలిపాడు. రికార్డుల కోసం ఆడడం లేదని, జట్టు విజయం కోసం ఆడుతామని, ఎంత బాగా ఆడినా జట్టు పరాజయం పాలైతే సాధించిన ఘనతను ఆస్వాదించలేమని చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు బాధించినప్పటికీ, వాటిలో వాస్తవముందని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగడమే ప్రతి ఆటగాడి ముందున్న కర్తవ్యమని రోహిత్ తెలిపాడు.

  • Loading...

More Telugu News