: మంచి నటుడవ్వాలనేదే నా కోరిక: జూనియర్ ఎన్టీఆర్


తనకు మంచి నటుడవ్వాలనే కోరిక ఉండేదని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. 'నాన్నకు ప్రేమతో' సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, తన కోరిక ఈ సినిమాతో తీరిందని అన్నాడు. సాధారణంగా సినిమాల్లో మాస్, క్లాస్ అనే తేడాలు ఉండవని పేర్కొన్నాడు. తనకు తెలిసినంత వరకు మనుషుల్లో రెండు రకాల వారు ఉంటారని.. భావోద్వేగాలను మనసులో నియంత్రించుకోగలిగిన వారు, భావోద్వేగాలను బయటపెట్టేసే వారు ఉంటారని, వీరినే మాస్- క్లాస్ గా మీడియా విభజిస్తుందని, వీరంతా సినిమాను ఆదరించేవారేనని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. ఈ సినిమా యూనివర్సల్ సినిమా అని, అన్ని వర్గాలను అలరించే సినిమా అని తెలిపాడు. తన తండ్రి హరికృష్ణకు ఈ సినిమా నచ్చిందని, ఆయన తనతో ఏమీ చెప్పలేదని, ఆయన చూసిన చూపు తనకు ఎన్నో మాటలు చెప్పిందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. ఈ సినిమాలో తన తండ్రి, సోదరుడు, ప్రేమించిన అమ్మాయి దగ్గర తప్ప మరెవరి దగ్గరా ఓపెన్ అవ్వడని, అందులోంచి పుట్టినదే నటన అని, చాలా బ్యాలెన్స్ తో నటించానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. 'టెంపర్' తరువాత ఈ సినిమా చేయడం సవాల్ లాంటిదని, ఆ సవాలును విజయవంతంగా పూర్తి చేశానని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News