: జీవితం ఒకటే...ఇలా జరిగిందేమిటని బాధపడకూడదు: జూనియర్ ఎన్టీఆర్


మనిషికి ఉన్న జీవితం ఒకటేనని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, విజయం, అపజయం అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం మాత్రం శాశ్వతంగా ఉంటామని ఆ శాశ్వతాన్ని స్థిరంగా ఉంచుకోగలగాలని జూనియర్ చెప్పాడు. జీవితం చివరి క్షణాల్లో 'నేనేంటి ఇలా చేశాను, ఇంకోలా చేసుంటే బాగుండేదే' అని చింతించాల్సిన అవసరం వుండకూడన్నాడు. సాధారణంగా తాను హైపర్ యాక్టివ్ మనిషినని, పెళ్లి అయ్యాక కొంత మారానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, నాన్నకు ప్రేమతో సినిమాతో మరింత మారానని చెప్పాడు. సుకుమార్ థాట్ ప్రోసెస్ ను చాలా ఇష్టపడతానని, ఆయనతో ఇలాంటి సినిమా చేయాలని కోరుకున్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు.

  • Loading...

More Telugu News