: ఎలాంటి సందేహమూ లేదు... పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాదే: బల్లగుద్ది చెప్పిన భారత్


ప్రస్తుతం పాకిస్థాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ లోని ప్రాంతంపై సర్వహక్కులూ భారత్ వేనని, అందులో ఏ మాత్రం సందేహం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అక్కడి అపార మౌలిక వనరుల వాడకంపై తమకు ఆందోళనలు ఉన్నాయని, ముఖ్యంగా గిల్గిట్, బాల్టిస్థాన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఆందోళన ఉందని పేర్కొంది. పీఓకే భారత్ లో అంతర్భాగమేనని, ఎట్టి పరిస్థితుల్లోను ఈ హక్కును ఇండియా వదులుకోబోదని మరోసారి తేల్చి చెప్పింది. పఠాన్ కోట్ లో ఉగ్రదాడి తరువాత విచారణకు ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు పాక్ అంగీకరించడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొంది. పాక్ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తామని, తమ వద్ద ఉన్న ఆధారాలను పంచుకుంటామని విదేశాంగ శాఖ తెలియజేసింది. భారత ఎన్ఐఏ అధికారులు, భద్రతాదళాలు దర్యాఫ్తు చేసి సేకరించిన వివరాలను పాక్ కు తెలుపుతామని వివరించింది.

  • Loading...

More Telugu News