: ఇన్ఫోసిస్ ఉత్ప్రేరకంగా నిలిచినా, నిలవని సెంటిమెంట్!
అంచనాలకు మించిన ఫలితాలతో ఇన్ఫోసిస్ మార్కెట్ వర్గాల సెంటిమెంట్ ను నిలిపి బెంచ్ మార్క్ సూచికలను లాభాల్లోకి నడిపించినా, యూరప్ మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో 300 పాయింట్ల నష్టం నుంచి లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్నం తరువాత తిరిగి నష్టాల్లోకి జారిపోయాయి. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 81.14 పాయింట్లు పడిపోయి 0.33 శాతం నష్టంతో 24,772.97 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 25.60 పాయింట్లు పడిపోయి 0.34 శాతం నష్టంతో 7,536.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 1.27 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 18 కంపెనీలు లాభాల్లో నడిచాయి. ఇన్ఫోసిస్, లుపిన్, ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్ తదితర కంపెనీలు లాభపడగా; యాక్సిస్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 95,33,140 కోట్లకు చేరింది. బీఎస్ఈలో మొత్తం 2,858 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 805 కంపెనీలు లాభాలను, 1883 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.