: టెక్ తెలంగాణ... స్మార్ట్ ఫోన్లలోకే ఓటర్ స్లిప్!
అందివచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో తెలంగాణ సర్కారు మరో ముందడుగు వేసింది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో స్మార్ట్ ఫోన్లలోనే ఓటర్ స్లిప్ లను అందించేందుకు ప్రత్యేక యాప్ ను విడుదల చేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో 'TSEC Voter slip' యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఆపై ఓటర్ నంబర్ ను ఎంటర్ చేస్తే, ఓటరు ఫోటో, పేరు, అడ్రస్, ఎక్కడ ఓటు వేయాలన్న వివరాలు ప్రత్యక్షమవుతాయి. దీన్ని సేవ్ చేసుకుని పోలింగ్ బూత్ లో చూపి ఓటేయవచ్చని అధికారులు వెల్లడించారు.