: తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితిని తలచుకుని కంటతడి పెట్టిన మోత్కుపల్లి!
తెలంగాణలో నానాటికీ దిగజారుతున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితిని తలచుకుని పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కంటతడి పెట్టారు. ఈ ఘటన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఓ సమావేశంలో జరిగినట్టు తెలుస్తోంది. పలువురు నేతలు వేదికపై ఉండగా, మోత్కుపల్లి ప్రసంగిస్తూ, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇలా నామరూపాల్లేకుండా పోతున్నదని ఉద్వేగానికి లోనయ్యారని సమాచారం. రాష్ట్రంలో పార్టీని బతికించుకోవాలని కూడా మోత్కుపల్లి సూచించారట. త్వరలోనే ఆలేరు నియోజకవర్గంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ప్రజలను కలుస్తానని ఈ సందర్భంగా మోత్కుపల్లి తెలిపినట్టు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి.