: బెట్టింగ్ రాయుళ్ళలో హుజీ టెర్రరిస్టు
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ పై ఉగ్రవాదుల కన్నుపడింది! అయితే, బాంబు పేలుళ్ళతో విధ్వంసం సృష్టించేందుకు కాకుండా, వీరి దృష్టి బెట్టింగ్ పై సారించారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు ఓ బెట్టింగ్ రాకెట్ ను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) ఉగ్రవాది కూడా ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు అరెస్టు చేసిన ఆ తీవ్రవాది పేరు షేక్ అబ్దుల్ ఖలీమ్. హుజీ దక్షిణ భారత అధిపతి షేక్ ఖాజాకు ఖలీమ్ సోదరుడు. ఖలీమ్ 2005లో సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కమిషనర్ కార్యాలయం వద్ద బాంబు పేలుడు కేసులో నిందితుడు. 2007లో మక్కా పేలుళ్ళలోనూ ఖలీమ్ ను అనుమానితుడిగా భావిస్తున్నారు.