: అప్రతిహత విజయాలతో అరుదైన రికార్డు నెలకొల్పిన సానియా జోడీ


సమకాలీన టెన్నిస్ మహిళల డబుల్స్ విభాగంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న సానియా మీర్జా, మార్టీనా హింగిస్ ల జోడీ అరుదైన రికార్డును నెలకొల్పింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిడ్నీ ఓపెన్ ఫైనల్స్ లోకి ప్రవేశించిన వీరిద్దరి జంట, వరుసగా 29 మ్యాచ్ లు గెలిచిన రికార్డు సాధించింది. దాదాపు 22 సంవత్సరాల క్రితం 1994లో 28 వరుస విజయాల రికార్డును కలిగివున్న గిరి ఫెర్నాండెజ్, నటాషా జ్వెరావాలు నెలకొల్పిన రికార్డును సానియా జోడీ బద్దలు కొట్టింది. ఇప్పుడు టెన్నిస్ క్రీడాకారుల నుంచి సానియా మీర్జాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News