: నో డౌట్... లెజండ్ ను మించిన హిట్ కొట్టే డిక్టేటర్: బాలకృష్ణ
"తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సంక్రాంతి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటున్న వేళ నేను నటించిన డిక్టేటర్ విడుదల కావడం ఎంతో సంతోషంగా ఉంది. నో డౌట్... లెజండ్ ను మించి డిక్టేటర్ చిత్రం విజయవంతం అవుతుంది" అని హీరో, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుపతి కృష్ణతేజ థియేటర్ లో అభిమానులతో కలిసి డిక్టేటర్ చిత్రాన్ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభిమానులతో కలసి చిత్రం చూడటం తనకు కొత్త అనుభూతిని కలిగించిందని అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకర్షిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. సినిమా ముగిసిన అనంతరం సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తన వియ్యంకుడు, ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు బాలయ్య బయలుదేరి వెళ్లారు.