: జపాన్ లో పెను భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ


జపాన్ లో కొద్దిసేపటి క్రితం పెను భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా దేశంలోని ఈశాన్య ప్రాంతం కొద్ది క్షణాల పాటు కంపించిపోయింది. పెను ప్రకంపనలు సృష్టించిన సదరు భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7 గా నమోదైనట్లు అమెరికా జియలాజికల్ సంస్థ ప్రకటించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. అయితే భారీ తీవ్రతతో కూడిన భూకంపం నేపథ్యంలో ఆ దేశంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News