: ఢిల్లీలో 90,000 మంది పోలీసులు... బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మాత్రం 250!
ఈ వార్త దేశంలోని పోలీసు వ్యవస్థకు దర్పణం పడుతుంది. దేశ రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉందంటే... మిగిలిన ప్రాంతాల గురించి ఇక చెప్పవనసరం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 90,000 మంది పోలీసులు ఉండగా, వారికి కేవలం 250 బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు మాత్రమే ఉన్నాయట. అయితే వీటిలో సగానికిపై జాకెట్లు బాగా వాడేసినవేనట. మిగిలిన 100 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఢిల్లీలోని 10 పోలీసు స్టేషన్ల సిబ్బందికి అత్యవసరమైన పరిస్థితుల్లో ఏమాత్రం సరిపోవు. పైగా ఈ 250 జాకెట్లు 11 కేజీల బరువు ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో అధిక సమయం పాటు వీటిని పోలీసులు ధరించలేరని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. పైగా ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఖరీదు రూ.40,000 వరకూ ఉంటుంది. అదే అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధర లక్ష రూపాయల వరకూ ఉండవచ్చని ఆయన తెలిపారు. మరి ఈ స్థాయిలో వీటిని పోలీసుశాఖ కొనుగోలు చేయగలదా? అనే ప్రశ్నకు మౌనమే సమాధానంగా నిలిచింది.