: నారావారిపల్లో బాలయ్య... మనవడు దేవాంశ్ తో కలిసి సంక్రాంతి సంబరాలు


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సంబరాల కోసం తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు తరలివెళ్లారు. మనవడు దేవాంశ్ తో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఆయన నిన్న రాత్రే అక్కడికి చేరుకున్నారు. తెల్లవారకముందే ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలయ్య అక్కడ బోగి మంటలు వేశారు. ఇదిలా ఉంటే, బాలయ్య నటించిన తాజా చిత్రం ‘డిక్టేటర్’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని బాలయ్య తొలుత చంద్రగిరి, ఆ తర్వాత తిరుపతిలో అభిమానులతో కలిసి చూడనున్నారు.

  • Loading...

More Telugu News