: ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక టికెట్లు...హాట్ కేకులే!
ప్రతిష్ఠాత్మక బాలీవుడ్ బ్రిటానియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ ఎల్లుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన టికెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. కేవలం చివరి 200 టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. 61వ బ్రిటానియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2015 ఫంక్షన్ ముంబయిలో ఈ నెల 15న ప్రారంభం కానుంది. తమ అభిమాన నటీనటులను స్వయంగా చూసేందుకు అభిమానులు భారీగానే టిక్కెట్లు కొనుగోలు చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, కరణ్ జోహార్, కపిల్ శర్మ ఈ వేడుకకు ఆతిథ్యమివ్వనున్నారు. అంతేకాకుండా ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అలియా భట్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్ తదితరుల సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నారు.