: జల్లికట్టు నిర్వహణకు మరోసారి ఎదురుదెబ్బ... స్టే ఎత్తివేసేందుకు సుప్రీం నిరాకరణ


తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిర్వహణకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జల్లికట్టు నిర్వహించేందుకు ఈ నెల 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు అనుమతించాలని కోరుతూ కొంతమంది నిర్వాహకులు ఈరోజు వేసిన రివ్యూ పిటిషన్ ను జస్టిస్ దీపక్ మిశ్రా, ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం విచారించింది. జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమని, జంతువులకు హాని కలగకుండా చర్య తీసుకుంటామని వాదనల సందర్భంగా పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. వారి వాదనలతో విభేదించిన కోర్టు, స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది.

  • Loading...

More Telugu News