: పఠాన్ కోట్ అమరవీరుల కుటుంబ సభ్యులకు కేజ్రీవాల్ పరామర్శ


ఇటీవల పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో అమరవీరులైన వారి కుటుంబ సభ్యులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. నాటి ఘటనలో ప్రాణాలు వదిలిన సైనికులు హవల్దార్ కుల్వంత్ సింగ్, ఫతేహా సింగ్, టాక్సీ డ్రైవర్ ఇకాగర్ సింగ్ కల్వంత్ ల స్వగ్రామాలైన చాక్ షరీఫ్, ఝుండా గురజాన్ లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అమరవీరులకు నివాళులర్పించారు. వారందరికీ అన్ని విధాలా అండగా ఉంటామని కేజ్రీ భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.

  • Loading...

More Telugu News