: విశాఖలో రూ.500 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రి: దత్తాత్రేయ


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో రూ.500 కోట్లతో 300 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా ముందుకొచ్చిందన్నారు. త్వరలోనే ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. విశాఖలో వర్కర్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని దత్తాత్రేయ వివరించారు. ఇక నిజాం కళాశాలలో నిర్వహించిన సభ కేడర్ ను ఉత్సాహపరిచిందని, గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నాయని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

  • Loading...

More Telugu News