: ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించే యోచనలో సర్కార్: ఎంపీ వినోద్


ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉందని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. కరీంనగర్ లో ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు జరిగింది. మంత్రి ఈటల రాజేందర్ ఈ స్టడీ సర్కిల్ ను ప్రారంభించారు. మంత్రితో పాటు ఎంపీ వినోద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ లోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను తీర్చిదిద్దుతామని అన్నారు. నీతివంతమైన, సమర్ధవంతమైన పాలనను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

  • Loading...

More Telugu News