: ఉగ్రవాదులకు కొన్ని దేశాలు సురక్షిత ప్రదేశాలుగా మారుతున్నాయి: బరాక్ ఒబామా
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ తో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో అస్థిరత అనేది భవిష్యత్ లో కూడా కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. తన అధ్యక్షపదవీ కాలం ముగియనుండటంతో దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన తుది ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, సెంట్రల్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఐఎస్ కార్యకలాపాలు లేనప్పటి నుంచి కూడా అస్థిరత కొనసాగుతూనే ఉందని అన్నారు. ఉగ్రవాదానికి కొత్తగా ఆకర్షితులవుతున్న వారికి ఈ దేశాల్లో కొన్ని సురక్షిత ప్రాంతాలుగా మారాయని ఒబామా అభిప్రాయపడ్డారు.