: జల్లికట్టు నిర్వహణకు ఆ మూడు రోజులు అనుమతివ్వండి: సుప్రీంలో పిటిషన్


తమిళనాడుకు చెందిన అత్యంత పురాతన క్రీడ జల్లికట్టుకు అనుమతి కోసం నిర్వాహకులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారు పిిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు జల్లికట్టు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే సంబంధిత బెంచ్ ముందు పిటిషన్ వేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ఆదేశించారు. ఇప్పటికే వన్యప్రాణి సంస్థ, 'పెటా'ల పిటిషన్ లతో, జల్లికట్టుకు కేంద్రం ఇచ్చిన అనుమతిపై సుప్రీం స్టే విధించింది. మరి సుప్రీంకోర్టు తాజా పిటిషన్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి!

  • Loading...

More Telugu News