: టీవీ చానల్ లైవ్ లో ఉన్న కేటీఆర్ కు ఫోన్ చేసి మరీ తన కోరిక చెప్పిన హీరో నాగార్జున


తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కె.తారక రామారావు ఓ టీవీ చానల్ లైవ్ షోలో పాల్గొన్న వేళ, 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం ద్వారా ఎల్లుండి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాగార్జున ఫోన్ చేశారు. టీవీ ప్రేక్షకులు వేస్తున్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇస్తున్న వేళ, నాగార్జున లైవ్ ద్వారా మాట్లాడి ఆయన ముందు తన కోరికను ఉంచారు. ఈ సంక్రాంతి సీజన్ లో పలు తెలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయని, పైరసీని అరికట్టాలని విన్నవించారు. పైరసీ భూతం కలెక్షన్లను దెబ్బతీస్తోందని చెప్పిన నాగార్జున, దీన్ని అరికడితేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమని అన్నారు. దీనికి స్పందించిన కేటీఆర్, 'శివ' చిత్రం నుంచి తాను నాగ్ వీరాభిమానిగా మారిపోయానని గుర్తు చేసుకున్నారు. పైరసీని నివారించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News