: బైక్ పై లాఠీ విసిరిన ఖాకీ... అత్త దుర్మరణం, అల్లుడికి గాయాలు


అనంతపురం జిల్లాలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత దారుణం చోటుచేసుకుంది. అత్తను బైక్ పై ఎక్కించుకుని వెళుతున్న వెంకటేశ్వరరెడ్డి అనే యువకుడిని నిలిపేందుకు ఎక్సైజ్ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. బైక్ నిలువరించేందుకు తమ చేతిలోని లాఠీని బైక్ పై విసిరారు. లాఠీ నేరుగా బైక్ చక్రాలకు తాకడంతో బైక్ కింద పడిపోయింది. ఈ ఘటనలో కింద పడ్డ వెంకటేశ్వరరెడ్డి అత్త తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇక వెంకటేశ్వరరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లాలోని యాడికి మండలం కుందనకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News