: మమతా బెనర్జీని పొగడ్తలతో ముంచెత్తిన పాకిస్థాన్ గాయకుడు!


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పాకిస్థాన్ గాయకుడు గులాం అలీ పొగడ్తల్లో ముంచెత్తారు. కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక సంగీత కచేరీ ఈరోజు నిర్వహించారు. భారీ బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. కచేరీ అనంతరం గులాం అలీని ఆమె ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గులాం అలీ మాట్లాడుతూ, తాను ఎన్నో ఏళ్లుగా కోల్ కతాకు వస్తున్నానని, మమత తనకు సరస్వతీ దేవి లాంటి దంటూ ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. కాగా, ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరుకావడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

  • Loading...

More Telugu News