: ఐఎస్ఐఎస్ ఇన్స్పిరేషన్... మహిళ మెడపై కత్తిపెట్టి వణుకు పుట్టించిన యువకుడు!


ఐఎస్ఐఎస్ భావజాలానికి ఆకర్షితుడైన ఒక యువకుడు ఉగ్రవాదిలా రెచ్చిపోయి ఒక మహిళను బెదిరించిన సంఘటన మలేసియాలో సంచలనం సృష్టించింది. ఆ పదహారేళ్ల యువకుడు ఇక్కడి కెదాహ్ రాష్ట్రంలోని సుంగాయ్ పఠానీలో ఉన్న ఒక మార్కెట్ వద్ద ఒక మహిళ గొంతుకు కత్తి పెట్టి ఆమెను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహిళకు ఎటువంటి హాని జరగకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి విషయమై పోలీసులు దర్యాప్తు చేయగా.. ఐఎస్ ప్రభావంతో తాను కూడా వారిలా చేయగలనని నిరూపించుకోవాలనుకున్నానని, అందుకే ఈ విధంగా చేశానని ఆ యువకుడు పోలీసులకు చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News