: అరుణ్ జైట్లీపై కేజ్రీవాల్ ఘాటు విమర్శ
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. తనపై కేంద్ర మంత్రి వేసిన పరువు నష్టం దావాపై ఆయన మాట్లాడుతూ, లక్ష ఓట్లతో ఓడిపోయిన అరుణ్ జైట్లీకి ప్రజల్లో పేరు ప్రతిష్ఠలేమీ లేవని అన్నారు. ప్రజల్లో తనకు గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉన్నాయని అరుణ్ జైట్లీ చెప్పుకుంటారని, అవి వాస్తవ విరుద్ధ వ్యాఖ్యలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ న్యాయస్థానానికి ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని ఆయన న్యాయస్థానానికి వివరించారు.