: ఇచ్చిన మాట తప్పితే.. నితీశ్ ఖాళీ మద్యం సీసాలు అందుకోవాల్సిందే!
బీహార్ ను మద్యపాన నిషేధ రాష్ట్రంగా చేయడంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విఫలమైతే వినూత్న తరహాలో ఆయనకు నిరసన తెలియజేసేందుకు మాజీ సీఎం మాంఝీ సిద్ధమవుతున్నారు. నితీశ్ కు, ఆయన మంత్రి బృందానికి ఖాళీ మద్యం సీసాలను పంపనున్నట్లు మాంఝీ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్ ను మద్యపాన నిషేధ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానంటూ ఎన్నికల ముందు నితీశ్ హామీ ఇచ్చిన విషయాన్ని మాంఝీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నితీశ్ మాట నిలబెట్టుకోవడంలో విఫలమైతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఖాళీ మద్యం సీసాలను ఆయనకు పంపుతామన్నారు.