: కొండ చిలువపై ప్రేమ ఒలకబోయపోతే...ముక్కు కొరికింది!
కొండ చిలువను చూసి రమ్మంటే.. దాని తలపై ముద్దుపెట్టుకున్న ఒక చైనీస్ పర్యాటకురాలికి చేదు అనుభవం ఎదురైంది. థాయ్ లాండ్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు.. చైనాకు చెందిన పర్యాటకురాలు జిన్ జింగ్(29) ఈ నెల 9వ తేదీన థాయ్ లాండ్ లోని మానవ రహిత జంతువుల పార్క్ గా పేరొందిన ఫుకెట్ కు వెళ్లింది. అక్కడ ఒక కొండ చిలువను దగ్గరగా చూసింది. ఆ తర్వాత దాని తలపై ముద్దు పెట్టుకుందో లేదో జింగ్ ముక్కును కొండచిలువ పట్టుకుంది. గట్టిగా కొరికింది. ఇదంతా చూస్తున్న మిగిలిన పర్యాటకులు గావు కేకలు పెట్టారు. ఈ సంఘటన అనంతరం జింగ్ ను ఫుకెట్ లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె ముక్కుకి బాగానే కుట్లు పడ్డాయి. ఆ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.