: ఫార్చ్యూన్ కవర్ పేజీపై విష్ణుమూర్తి అవతారంలో అమెజాన్ సీఈవో!
ఫార్చ్యూన్ పత్రిక జనవరి ఎడిషన్ కవర్ పేజీ వివాదాస్పదమైంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఫోటోను విష్ణుమూర్తి అవతారంలో ఈ పేజ్ పై ముద్రించడమే ఇందుకు కారణమైంది. హిందువులు ఎక్కువగా ఆరాధించే విష్ణువు అవతారంలో ఆయన ఫోటోను ముద్రించడం పట్ల పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ ఆన్ లైన్ మార్కెట్ లో అమెజాన్ దూసుకుపోతున్న వైనంపై 'అమెజాన్ ఇన్ వేడ్స్ ఇండియా' పేరుతో ఫార్చ్యూన్ ఓ కథనాన్ని ప్రచురించింది. వాణిజ్యపరమైన అంశాలను హిందూమత దేవుడికి ముడిపెట్టడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇందుకు ఫార్చ్యూన్ పత్రిక క్షమాపణ చెప్పాలని, వచ్చే నెల ఎడిషన్ లో వివరణ ఇవ్వాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.