: హైదరాబాదుకు పవన్ కల్యాణ్ సేవలు అవసరం!: దానం నాగేందర్
హైదరాబాద్ నగరానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సేవలు అవసరం అని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. కాపులు, బలహీనవర్గాలను ఎంపీ కవిత చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. పవన్ ను మేకప్, పేకప్ అని ఆమె విమర్శించిందంటూ మండిపడ్డారు. కాబట్టి ఇకనైనా పవన్ మేల్కోవాలని దానం సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో నిర్వహించిన ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, జానారెడ్డి, దానం, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రేటర్ ప్రజలకు టీఆర్ఎస్ అరచేతిలో స్వర్గం చూపిస్తోందని, ఓట్ల కోసమే టీఆర్ఎస్ ను 'తెలుగు రాష్ట్ర సమితి'గా మారుస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.