: 'చిల్లర' సమస్యను అలా అధిగమించాడు!
ఆలోచన అనేది వుంటే కనుక ఎటువంటి పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించాడు చైనాలోని ఓ వ్యాపారి. అక్కడి జెంజౌ ప్రాంతానికి చెందిన జంగ్ అనే ఈ వ్యాపారి తన దగ్గర పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వాల్సి రావడంతో అందుకు కరెన్సీ నోట్లు కావాల్సి వచ్చాయి. దీంతో జంగ్ తన దగ్గర పోగుపడిన సుమారు మూడు లక్షల యువాన్ నాణేలను నోట్లుగా మార్చేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అయితే అన్ని చిల్లర నాణేలను ఒకేసారి మార్చడం కుదరదని చెప్పిన బ్యాంకు అధికారులు రోజుకు రెండు నుంచి మూడు వేల నాణేలను మాత్రమే తీసుకుంటామని చెప్పారు. దీంతో ఏం చేయాలా? అని జంగ్ కాసేపు ఆలోచించగా ఓ ఐడియా తట్టింది. వెంటనే తన దగ్గర ఉన్న చిల్లరను మూటలుగా కట్టి రోడ్డుపక్కన అమ్మకానికి పెట్టాడు. దీంతో చిల్లర అవసరం ఉన్నవారంతా జంగ్ దగ్గర మూటలు కట్టిన నాణేలను కొనుక్కున్నారు. అలా 'చిల్లర' సమస్యను అధిగమించాడు జంగ్.