: ఏపీ పర్యాటక రంగంలో రూ.7,840 కోట్ల ఒప్పందాలు


విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారు. మూడో రోజు విశాఖలో జరుగుతున్న సదస్సులో భాగంగా పర్యాటక రంగంలో వివిధ సంస్థలతో రూ.7,840 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అందులో ఐవరీ శాండ్, వైకేఎం ఎంటర్ ప్రైజెస్, ఒంటర్ గ్లోబల్ హాస్పిటాలిటీ కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో మురళీ ఫార్చూన్ హోటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ విజయవాడలో ఏడున్నర ఎకరాల్లో భారీ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించనుంది. మరోవైపు ఎస్సెల్ గ్రూప్ ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.73వేల కోట్లతో 10వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడ, 200 పరిశ్రమల ఏర్పాటుకు ఎస్సెల్ గ్రూప్ తో ఒప్పందాలు కుదిరాయి. 13వేల కోట్లతో సోలార్ ప్యానల్స్ పరిశ్రమను నెలకొల్పనుంది.

  • Loading...

More Telugu News