: కేటీఆర్ కొత్త పల్లవి...నేను కూడా సెటిలర్ నే: కేటీఆర్
'నేను కూడా సెటిలర్ నే'నంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొత్తపల్లవి అందుకున్నారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లు కొల్లగొట్టేందుకు నేతలు వివిధ నినాదాలు అందుకుంటున్నారు. అందులో భాగంగా హైదరాబాదులో టీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్న కేటీఆర్ మాట్లాడుతూ, తాను సిద్ధిపేట్ నుంచి హైదరాబాదు వచ్చి స్థిరపడినవాడినని అన్నారు. 'అసలు హైదరాబాదులో సెటిలర్ కాని వారెవరు?' అంటూ ఆయన ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. కాగా, ఉద్యమ సమయంలో కొన్ని మాటలు మాట్లాడినా ఇప్పుడా ఫీలింగ్ లేదని, సీమాంధ్రులు ఆలోచించి టీఆర్ఎస్ కు ఓటేయాలని ఆయన సూచించారు.