: యూఎస్ కాన్సులేట్ ఎదుట ధర్నాకు సీపీఐ నేతల విఫలయత్నం


హైదరాబాద్ బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఎదుట సీపీఐ నేతలు, ఏఐఎస్ఎఫ్ నేతలు ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు కార్యాలయం దగ్గరకు రాకముందే అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాన్సులేట్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమెరికా తిప్పి పంపిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యార్థుల జీవితాలతో అమెరికా చెలగాటమాడుతోందని విమర్శించారు. ప్రధానితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు యూఎస్ పై ఒత్తిడి చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని నారాయణ కోరారు.

  • Loading...

More Telugu News