: రేఖను 'అమ్మా' అని పిలిచిన ఐశ్వర్యారాయ్... అయోమయంగా చూసిన అమితాబ్!
బాలీవుడ్ జనాలకు చర్చించుకునేందుకు మరో వార్త దొరికింది. శాన్ సుయ్ స్టార్ డస్ట్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా జరిగిన ఓ ఘటనపైనే ఇప్పుడు చర్చంతా. ఇంతకీ విషయం ఏంటంటే, 'జబ్బా' చిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఐశ్వర్యారాయ్ కి ఉత్తమ నటి అవార్డు లభించగా, దాన్ని వెటరన్ బ్యూటీ రేఖ తన చేతుల మీదుగా అందించారు. అవార్డు స్వీకరించిన తరువాత ఐశ్వర్య 'థ్యాంక్యూ అమ్మా' అని అనగా, ఫంక్షన్ ముందు వరుసలో కూర్చున్న అమితాబ్ కాస్త అయోమయంగా చూశారట. ఇదంతా కెమెరాలకు ఎక్కి సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా, గతంలో అమితాబ్, రేఖల మధ్య చానా ఏళ్లు ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ అయోమయ చూపుల వెనుక అసలు అర్థమేంటో!