: సత్తా చాటిన శ్రాన్... రెండో ఓవర్ లోనే వికెట్ తీసిన టీమిండియా కొత్త ఫేసర్


ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా సత్తా చాటుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోగా, రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. బ్యాటు విరిగేలా బంతిని బాదిన అతడు 171 పరుగులు సాధించాడు. జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలిలో రాణించి 91 పరుగులు చేసి ఆసీస్ కు 310 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. ఇక కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఆసీస్ ఇన్నింగ్స్ లో భారత బౌలింగ్ ను కొత్త కుర్రాడు బరీందర్ శ్రాన్ ప్రారంభించాడు. తొలి ఓవర్ లో లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరిన అతడు మూడంటే మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తన రెండో ఓవర్(ఇన్నింగ్స్ మూడో ఓవర్) మూడో బంతికే ఆసీస్ ఓపెనర్ ఆరోన్ పించ్ న బోల్తా కొట్టించి సత్తా చాటాడు. శ్రాన్ వేసిన బంతిని అతడికే క్యాచ్ ఇచ్చి పించ్(8) ఔటయ్యాడు.

  • Loading...

More Telugu News