: మిలిటరీ యూనిఫాంలో ఇద్దరు ముష్కరులు?... ఫిరోజ్ పూర్ లో హై అలర్ట్!


పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్ ను ‘ఉగ్ర’ భయం వీడలేదు. న్యూ ఇయర్ వేడుకలు ముగిశాయో, లేదో ఆ రాష్ట్రంలోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఆరుగురు ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. డిసెంబర్ 30 కంటే ముందే దేశంలోకి చొరబడ్డ ముష్కరులు పఠాన్ కోట్ లోకి ప్రవేశించి రెండు రోజుల పాటు భీకర కాల్పులతో మోత మోగించారు. ఇక దేశంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఆరుగురే కాదు, మరింత మంది ఉన్నారన్న అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు గురుదాస్ పూర్ జిల్లాను జల్లెడ పట్టాయి. ఆ జిల్లాలోని ఓ చెరకు తోటలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో చెరకు గడలను నరికి మరీ సోదాలు చేశారు. అయితే ఉగ్రవాదుల జాడ మాత్రం కానరాలేదు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ లో ఇద్దరు వ్యక్తులు మిలిటరీ దుస్తులు వేసుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు ఫిరోజ్ పూర్ లోని కంటోన్మెంట్ ఏరియాను చుట్టుముట్టారు. ముమ్మరంగా సోదాలు జరుపుతున్నారు. దీంతో అక్కడ మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News