: సెంచరీ ముంగిట కోహ్లీ అవుట్... బౌండరీ రూపంలో తన ఉద్దేశాన్ని చెప్పిన ధోనీ!
91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ అవుట్ కాగానే వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చీ రాగానే తన మనసులోని ఉద్దేశాన్ని ఫోర్ రూపంలో చూపించాడు. అంతకుముందు ఫాల్కనర్ వేసిన 44వ ఓవర్ 3వ బంతికి ఫించ్ కు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ పెవీలియన్ చేరాడు. మొత్తం 97 బంతులాడిన కోహ్లీ 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 91 పరుగులు చేశాడు. మరో వైపు రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ, 134 పరుగుల వద్ద ఉన్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 45 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగులు.